అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా? ప్రమాదమేనట.. ఎందుకో తెలుసా?

ఈరోజుల్లో ఆరోగ్యం కంటే ఆరోగ్యమే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం, జీవనశైలి రకరకాల కారణాల వల్ల మనిషి అనారోగ్య

Update: 2024-03-17 07:13 GMT

Health tips

ఈరోజుల్లో ఆరోగ్యం కంటే ఆరోగ్యమే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం, జీవనశైలి రకరకాల కారణాల వల్ల మనిషి అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడు. మన ఆరోగ్యానికి పండ్లు చాలా అవసరం. వైద్యులు సైతం పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పదేపదే చెబుతుంటారరు. పండ్ల ద్వారా ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. కొంతమంది వివిధ రకాల పండ్లను సలాడ్ రూపంలో తినడానికి ఇష్టపడతారు. అరటిపండు, బొప్పాయి కలిపి తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ రెండు ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తున్నారు వైద్యులు.

అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా?

అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం మన జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటి, బొప్పాయి రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వాటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. అరటిపండు, బొప్పాయి కలిపి తింటే వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, వికారం, ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు వస్తాయట. అంతేకాకుండా ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కామెర్లతో బాధపడేవారు బొప్పాయి తినొచ్చా?

ఇదిలా ఉండగా, కామెర్లు బాధపడుతున్నవారు బొప్పాయి తినవచ్చా అంటే అస్సలు తినొద్దంటున్నారు వైద్యులు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతుందని చెబుతున్నారు. ఇక శరీరంలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటే అరటిపండ్లను తినకూడదు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News