ఫ్యాక్ట్ చెక్: లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతున్న వీడియో నిజమైనది కాదు, ఇది డిజిటల్ గా సృష్టించిన వీడియో

Viral video of Lt Gen Rajiv Ghai warning against saffronization is digitally manipulated

Update: 2025-10-24 11:23 GMT

Lt Gen Rajiv Ghai deepfake video

మే 2025లో, భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా ఇది జరిగింది.

ఆపరేషన్ సింధూర్ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ పెద్ద ఎత్తున నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందేలా ప్రయత్నాలు చేశారు. నకిలీ, తప్పుదారి పట్టించే కథనాల వ్యాప్తిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించి, దేశ మీడియా, పౌరులకు ఖచ్చితమైన సమాచారం అందించింది.
అయినా కూడా దేశ వ్యతిరేక శక్తులు నకిలీ వీడియోలు, నకిలీ చిత్రాలను విస్తృతంగా పంచుకున్నారు. ఇతర దేశాల మధ్య గొడవల సమయంలో (ఉక్రెయిన్-రష్యా వంటివి) రికార్డు అయినా దృశ్యాలను, సైనిక విన్యాసాలు, ప్రమాదాలకు సంబంధించిన పాత ఫుటేజీలను ప్రసారం చేయడం, వాటిని భారతదేశానికి సంబంధించిన ఇటీవలి సంఘటనలుగా తప్పుగా చిత్రీకరించడం లాంటివి చేశారు. నకిలీ వార్తలను ప్రచారం చేసే పనిలో భాగంగా వీడియో గేమ్ విజువల్స్ ను కూడా విరివిగా ఉపయోగించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి #IndianFalseFlag #PahalgamDramaExposed వంటి హ్యాష్‌ట్యాగ్ తో కథనాలను ప్రచారం చేశారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌లతో కూడిన 75% కంటే ఎక్కువ పోస్ట్‌లు పాకిస్తాన్ ఖాతాల నుండి వచ్చాయని ఒక విశ్లేషణలో తేలింది, వీటిలో చాలా వరకు పాకిస్థాన్ ప్రభుత్వ అనుకూల లేదా పాక్ సైనిక శక్తికి సంబంధించి అనుకూల కథనాలతో ముడిపడి ఉన్నాయి.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వీడియోలో మాట్లాడుతున్నట్లు చూపించే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆయన బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యానించారని, సాయుధ దళాలను రాజకీయం చేయడం లేదా కాషాయీకరణ చేయడం భారత సాయుధ దళాల నైతికతను దెబ్బతీస్తుందని చెప్పారని పోస్టుల్లో పేర్కొన్నారు. భారత సైన్యాన్ని హిందుత్వానికి లొంగదీసుకునే అన్ని ప్రయత్నాలను సాయుధ దళాలు ప్రతిఘటిస్తాయని అందులో తెలిపారు.
వీడియోలో, ఆయన మాట్లాడుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ లో రిపబ్లిక్ టీవీ లోగోను కూడా చూడవచ్చు. ఎడమ ఎగువ మూలలో, మనం R డిఫెన్స్ లోగోను కూడా చూడవచ్చు.
వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని చేసి వెతకగా, అసలు వీడియో రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్‌క్లేవ్ నుండి వచ్చినదని మేము కనుగొన్నాము.
వీడియోను అక్టోబర్ 18, 2025న రిపబ్లిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ‘Lt Gen Rajiv Ghai LIVE on India’s Biggest Forces First Conclave’ అనే శీర్షికతో పోస్టు చేశారు.
'ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్' గురించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, రిపబ్లిక్ టీవీ నివేదిక ప్రకారం, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ), డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పంపినట్లు ప్రస్తావించారు. ఒకవేళ పాకిస్తాన్ తోకజాడిస్తే భారతదేశం ఆపరేషన్ 2.0 కోసం సిద్ధంగా ఉందని తెలిపారు.
Full View
Full View
రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్ 'ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్'లో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్, భారతదేశం విష్యత్ యుద్ధ సంసిద్ధత గురించి విస్తృతంగా మాట్లాడారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో జరిగిన సైనిక సంఘర్షణ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.
ఆయన ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ లాంటి అనుభవం అనేది చాలా అరుదుగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత సైనికుడు ప్రపంచంలోనే అత్యుత్తమ సైనికుడని, భారత సైన్యం, సాహసోపేతమైన వైమానిక యోధులు, భారత నావికాదళం ప్రయత్నాల కారణంగా భారత సైన్యం విజేతగా నిలిచిందన్నారు. ఈ ఆపరేషన్ భారతదేశ సిద్ధాంత పరిణామంలో ఒక కీలకమైన క్షణంగా నిలుస్తుందన్నారు.
ఈ ఆపరేషన్ భారతదేశ సైనిక శక్తి గురించి ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి ప్రతీకారంగా పలు చర్యలు తీసుకున్నామని, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
‘Deepfake Video Alert’ Pakistani propaganda accounts are circulating a digitally altered video of Lieutenant General Rajiv Ghai with false claims suggesting he said that politicization or saffronization of the Indian Armed Forces would damage the morale of the Army #PIBFactCheck Lieutenant General Rajiv Ghai has NOT made any such statement This #AI-generated #fake video is being circulated to mislead people and create distrust against the Indian Armed Forces. Watch the genuine, unedited video here:
https://youtu.be/g-j8cXHNrvo
If you come across such content, please report it immediately: +91 8799711259 factcheck@pib.gov.in @SpokespersonMoD @HQ_IDS_India అంటూ PIB Fact check సంస్థ పోస్టు పెట్టింది. ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ అందులో తెలిపారు. ‘డీప్‌ఫేక్ వీడియో అలర్ట్’ పాకిస్తాన్ ప్రచార ఖాతాలు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కు సంబంధించి డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేస్తున్నాయి. భారత సాయుధ దళాలను రాజకీయం చేయడం లేదా కాషాయీకరణ చేయడం వల్ల సైన్యం నైతికత దెబ్బతింటుందని ఆయన చెప్పలేదని, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించడానికి, భారత సాయుధ దళాలపై అపనమ్మకాన్ని సృష్టించడానికి ప్రసారం చేయబడుతోంది. నిజమైన, ఎడిట్ చేయని వీడియోను ఇక్కడ చూడండి:
https://youtu.be/g-j8cXHNrvo
అంటూ లింక్ చేశారు.
కాబట్టి, వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాంటి ప్రకటన చేయలేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim :  సాయుధ దళాలను రాజకీయం చేయడం నైతికతను దెబ్బతీస్తుందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హెచ్చరిస్తున్నట్లు వీడియో చూపిస్తోంది
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News