ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో నిజమైన క్లౌడ్‌బరస్ట్‌ ను చూపడం లేదు, ఇది ఏఐ తో తయారు చేసిన వీడియో

జూలై- ఆగస్టు 2025లో, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్‌ జరిగింది, ఎక్కువగా ఈ పరిస్థితి హిమాలయ ప్రాంతంలో చోటు

Update: 2025-08-25 08:43 GMT

AI-generated cloudburst video

జూలై- ఆగస్టు 2025లో, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్‌ జరిగింది, ఎక్కువగా ఈ పరిస్థితి హిమాలయ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. ఆగస్టు 5న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఆకస్మిక వరదలు సంభవించాయి, దీనివల్ల గణనీయమైన ప్రాణనష్టం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా జూలై- ఆగస్టులో భారీ వర్షాలకు వణికింది. ఇక ఆకస్మిక వరదలతో పలు ప్రాంతాల్లో పెను నష్టం సంభవించింది. మౌలిక సదుపాయాలకు ఊహించని నష్టం జరిగింది. కిష్త్వార్-చసోటి ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం సంభవించింది, నివేదికల ప్రకారం 46-60 మంది మరణించారు. 200 మందికి పైగా తప్పిపోయారు.

ఇంతలో, అకస్మాత్తుగా క్లౌడ్‌బరస్ట్‌ (మేఘాల విస్ఫోటనం) ఒక వీధిని తాకినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది భారతదేశంలో సంభవించిన మేఘాల విస్ఫోటనాన్ని చూపిస్తుందనే వాదనతో షేర్ చేస్తున్నారు. వీడియోలో, ఆకస్మిక వర్షం వచ్చినప్పుడు వీధిలో ఆపి ఉంచిన కొన్ని స్కూటర్లను మనం చూడవచ్చు. “नहीं देखा तो देख लें इस तरह फटता है बादल...” అంటూ పోస్టులు పెట్టారు. మీకు మేఘాల విస్ఫోటనం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

Full View


Full View


Full View

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో క్లౌడ్‌బరస్ట్‌ కు సంబంధించిన నిజమైన సంఘటనను చూపడం లేదు. ఈ వీడియోను AI ద్వారా సృష్టించారని తెలుస్తోంది.
వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, అకస్మాత్తుగా వర్షం కురిసిన తర్వాత కూడా, వాహనాలు నిలబడే ఉన్నాయని, వీధి పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదని 
విజువల్స్ లో చూడొచ్చు
. క్లౌడ్‌బర్స్ట్‌కు ముందు, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ ఉన్నాయి.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోను కాందా ఒడిస్సీ వైన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోను “Sudden Flood. This is AI-generated + VFX-touched fictional content for entertainment purposes only. #AIVFX #AIGenerated #VisualEffects #VFXMagic #AIVideo #CGIArt #AIReality” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
మరింతగా తనిఖీ చేసినప్పుడు, AI- VFX ఉపయోగించి సృష్టించిన ఆకస్మిక, వింత సంఘటనలను చూపించే మరిన్ని వీడియోలను మేము కనుగొన్నాము. Instagram పేజీలో పోస్ట్ చేసిన వీడియోలకు సంబంధించిన లింక్‌లను ఇక్కడ చూడొచ్చు.

ఆ సోషల్ మీడియా ఖాతా బయోలో ‘Reel creator, Reality, reimagined in seconds, AI VFX | Short Reels’. అని ఉంది.

Cantilux Deepfake detection tool ను ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించబడిన చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, అందుకు సంబంధించిన ఫలితాలు అది AI- జనరేట్ చేసినట్లుగా నిర్ధారించాయి. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ 
చూడొచ్చు
.

వైరల్ వీడియో నుండి సంగ్రహించిన చిత్రాన్ని AI డిటెక్టర్ Wasitai ఉపయోగించి మేము తనిఖీ చేయగా, ఫలితాలు AI-జనరేటెడ్ అని నిర్ధారించాయి. ఫలితాల స్క్రీన్‌షాట్ ఇక్కడ చూడొచ్చు.

కనుక, వైరల్ వీడియో AI-జనరేటెడ్, ఇది నిజమైన క్లౌడ్‌బరస్ట్‌ ను చూపిస్తుందనే వాదన నిజం కాదు.
Claim :  వైరల్ వీడియోలో అకస్మాత్తుగా మేఘాల విస్ఫోటనం ఏర్పడి, భారీ వర్షం, వరదలకు దారితీసింది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News