నిజ నిర్ధారణ: హోం వ్యవహారాల శాఖ అధికారులుగా నటిస్తూ దొంగలు ఇళ్లను దోచుకుంటున్నారా?

హోంశాఖ అధికారులుగా నటిస్తూ కొందరు ఇళ్లను దోచుకుంటున్నారని ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లో తెలుగులో హై అలర్ట్ సందేశం ఒకటి ప్రచారంలో ఉంది.

Update: 2022-08-29 11:32 GMT

హోంశాఖ అధికారులుగా నటిస్తూ కొందరు ఇళ్లను దోచుకుంటున్నారని ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లో తెలుగులో హై అలర్ట్ సందేశం ఒకటి ప్రచారంలో ఉంది.

తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న సందేశం, కొంతమంది మోసగాళ్లు హోం వ్యవహారాల శాఖ అధికారులుగా నటిస్తూ ఇళ్లకు వస్తున్నారని పేర్కొంది. వారి వద్ద పత్రాలు, లెటర్‌హెడ్‌లు కూడా ఉన్నాయి. వచ్చే జనాభా లెక్కలకు ముందు ప్రతి ఒక్కరి వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు ఉన్నాయా లేదా చుసేందుకు అనే సాకుతో వచ్చి ఇళ్లను కొల్లగొడుతున్నారు.

వీరు అన్ని చోట్లా ఉన్నారని, ప్రభుత్వం నుండి అలాంటి చొరవ లేదని సందేశం కొనసాగుతుంది. ఒక వ్యక్తి వచ్చి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం బొటనవేలు ముద్రలు/సంతకాలు లేదా ఫోటోలు అడిగితే, వారి వద్ద ల్యాప్‌టాప్‌లు మరియు వ్యక్తుల జాబితా ఉన్నప్పటికీ, అతనికి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దు అంటూ ఈ సందేశం పేర్కొంటుంది.

Full View


Full View

పూర్తి క్లెయిమ్ ఇక్కడ ఉంది: "హై సెక్యూరిటీ అలర్ట్: జాగ్రత్త, ఇంటిని దోచుకోవడానికి సరికొత్త మార్గం ఒక గుంపు ఇంటింటికీ తిరుగుతూ హోం వ్యవహారాల అధికారులుగా నటిస్తోంది. వారు హోం వ్యవహారాల శాఖ నుండి పత్రాలు మరియు లెటర్‌హెడ్‌లను కలిగి ఉన్నారు మరియు రాబోయే జనాభా గణన కోసం ప్రతి ఒక్కరూ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని ధృవీకరిస్తారు. ఇళ్లను దోచుకుంటున్నారు. ప్రభుత్వం అటువంటి చొరవ తీసుకోలేదని దయచేసి గమనించండి. దయచేసి దీన్ని మీ పొరుగు గ్రూప్ చాట్‌కి పంపండి. వారు ప్రతిచోటా ఉన్నారు మరియు వారు అందంగా కనిపిస్తారు. దయచేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను అప్రమత్తం చేయండి. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, * నేను 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద మీ ఫోటో/బొటనవేలు ముద్ర వేయాలనుకుంటున్నాను. వారి దగ్గర ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మెషిన్ మరియు దాని పేర్లన్నీ ఉన్నాయి. లిస్ట్ చూపించి ఈ వివరాలన్నీ అడుగుతున్నారు. ఇదంతా ఫేక్ అని చెబుతున్నారు. దయచేసి అతనికి ఎలాంటి సమాచారం ఇవ్వకండి. దయచేసి మహిళలకు చెప్పండి, ముఖ్యంగా వారు ID చూపిస్తే, దయచేసి వారిని ఇంట్లోకి రానివ్వకండి. మీ సమాచారం కోసం ఈ పోస్ట్ పంపుతున్నాను. అందరూ అప్రమత్తంగా ఉండి గ్రూప్‌లో లేని వారికి చెప్పండి"

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆంగ్ల అనువాదాన్ని శోధించినప్పుడు, క్లెయిం ఆంగ్ల భాషలో కూడా సర్క్యులేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంగ్ల భాష క్లెయిం: HIGH SECURITY ALERT: Beware, the latest way to rob a house is a group going door-to-door pretending to be home affairs officers. They have documents and letterheads from the Department of Home Affairs and claim to confirm that everyone has a valid identity card for the upcoming census. They are looting houses. Please note that no such initiative has been taken by the government. Please send this to your neighborhood group chat. They are everywhere and they look presentable. Please alert your family and friends. A person comes home and says * I want to take your photo/thumb impression under 'Ayushman Bharat' scheme. They have a laptop, a biometric machine and a list of all its names. They are showing a list and asking for all this information. It is being told that this is all fake. Pls don't give him any information. Please tell women, especially if they show ID, please don't let them inside the house. I am sending this post for your information. Everyone be alert and tell those who are not in the group.

Forward to all groups

Full View

ఆర్కైవ్ లింకులు:

https://web.archive.org/web/20220829071820/https://www.facebook.com/photo/?fbid=797948714961432

https://web.archive.org/web/20220829071959/https://www.facebook.com/login/?next=https%3A%2F%2Fwww.facebook.com%2Faejaz.hamid.1%2Fposts%2F735411020861348

నిజ నిర్ధారణ:

హోంశాఖ అధికారులుగా వేషం వేసి మోసగాళ్లు ఇళ్లను దోచుకుంటున్నారనే వాదన అవాస్తవం.

శోధించగా, ప్రభుత్వ శాఖల నుండి ఇలాంటి సలహా లేదా హెచ్చరిక జారీ అయినట్టు కనిపించలేదు. భారతదేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేదు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖా ను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు.

https://www.mha.gov.in/departments-of-mha

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్‌ను క్యూగా ఉపయోగిస్తూ శోధించగా, 2017లో ప్రచురితమైన దక్షిణాఫ్రికాకు చెందిన పాత నివేదికలు లభించాయి.

2017 లో దక్షిణాఫ్రికా హోం వ్యవహారాల శాఖ ఒక మీడియా ప్రకటనను విడుదల చేసింది,

"కొంతమంది వ్యక్తులు హోం వ్యవహారాల నుండి లెటర్‌హెడ్‌లతో కూడిన పత్రాలను ఇంటీంటికీ తీసుకువెళుతున్నారని, రాబోయే ఎన్నికల కోసం ఐడి ల చెల్లుబాటును ధృవీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యక్తులు గృహాలను దోచుకునే నేరస్థులు. శాఖ నుంచి అధికారులు ఎవరూ ఇళ్లకు వెళ్ళడం లేదు. హోమ్ వ్యవహారాల అధికారులు పేరు ట్యాగ్‌ల ద్వారా స్పష్టంగా గుర్తించబడతారు. మేము అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారా గృహ సందర్శనలను ప్రకటిస్తాము."

ఇది అక్టోబర్ 20, 2017న దక్షిణాఫ్రికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు, వెబ్‌సైట్, ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.



ఐడీలను ధ్రువీకరించేందుకు అధికారులు ఎవరూ ఇళ్లకు రావడం లేదని వారు పునరుద్ఘాటించారు.

ఆ తర్వాత, ఇదే సందేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, మలేషియా మొదలైన వాటిలో వైరల్ అయింది. ఇది 2019లో భారతదేశంలో కూడా వైరల్ అయ్యింది, అనేక నిజ నిర్ధారణ సంస్థలు ఫ్యాక్ట్ చెచ్క్ చేసాయి.

https://timesofindia.indiatimes.com/times-fact-check/news/fake-alert-people-posing-as-officials-from-ministry-of-home-affairs-looting-homes/articleshow/68592280.cms

https://www.snopes.com/fact-check/home-affairs-robbery-census/

ఆయుష్మాన్ భారత్ గురించి కొంత అదనపు టెక్స్ట్ సందేశానికి స్థానికంగా కనిపించేలా జోడించి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం గురించి శోధించినప్పుడు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంది

https://mera.pmjay.gov.in/search/login

అందుకే, హోంశాఖ అధికారుల వేషాలలో దుండగులు ఇళ్లను దోచుకుంటున్నారనే వాదన అవాస్తవం. దక్షిణాఫ్రికాకు చెందిన పాత సందేశం భారతదేశానికి చెందినదిగా ప్రచారంలో ఉంది.

Claim :  Robbers posing as Department of Home Affairs officials are looting Homes
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News