ఫ్యాక్ట్ చెక్: బైకర్ పై దాడి చేసిన చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
బైకర్ పై దాడి చేసిన చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియో
భారతదేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ రోజురోజుకూ పెరుగుతోంది. 'చిరుతపులుల దాడులు' ఒక తీవ్రమైన సామాజిక, పర్యావరణ సమస్యగా మారాయి. పెరుగుతున్న పట్టణీకరణ, వ్యవసాయ విస్తరణ, అడవుల నిర్మూలన కారణంగా చిరుతపులులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవులు తగ్గిపోవడంతో అవి జనావాసాల్లోకి రాక తప్పడం లేదు. అడవుల్లో వేట వల్ల లేదా ఇతర కారణాల వల్ల జింకలు, కుందేళ్లు వంటి వాటి సంఖ్య తగ్గడంతో, ఆహారం కోసం చిరుతలు గ్రామాలు, పట్టణాల వైపు వస్తున్నాయి. మానవ నివాసాల వద్ద వీధి కుక్కలు, మేకలు, గొర్రెలు, ఆవులు వంటి పెంపుడు జంతువులు సులభంగా దొరకడం చిరుతలను ఆకర్షిస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో దట్టంగా పెరిగే చెరకు తోటలను చిరుతలు తమ సురక్షిత స్థావరాలుగా ఎంచుకుంటున్నాయి. దీంతో రైతులు పొలాలకు వెళ్లినప్పుడు దాడులు జరుగుతున్నాయి. భారతదేశంలో పలు రాష్ట్రాలు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల నడక మార్గాల్లో, అటవీ అంచుల గ్రామాల్లో, అలాగే తెలంగాణలోని నల్లమల, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి అటవీ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో చిరుతల సంచారం, దాడులు కలకలం రేపాయి.
బైక్ పై వెళుతున్న ఓ యువకుడిపై చిరుతపులి దాడి చేయడానికి దూకడం, అతడు ధైర్యంగా ఎదుర్కోడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో చూడొచ్చు. లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
https://archive.ph/UW74b
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా చిరుతపులి ప్రవర్తించిన తీరు ఎంతో విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ పులి దాడి నుండి తప్పించుకోడానికి ఆ యువకుడు ప్రయత్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ‘wilda_nimalpic’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీకి దారితీసింది. ఫిబ్రవరి 15, 2026న మొదట షేర్ చేసిన చిరుతపులి ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియోకు మూలం ఇదే పేజీ అని తేలింది.
వైరల్ వీడియో ప్రామాణికతను ధృవీకరించడానికి ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఇతర కంటెంట్‌ను విశ్లేషించగా, డెస్క్ ఆ పేజీ ప్రధానంగా AI- జనరేటెడ్ కంటెంట్‌ను ఎక్కువగా షేర్ చేసిందని కనుగొన్నాం.
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. ఈ టూల్స్ వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని తేల్చాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
AI వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఉన్నారు. కృత్రిమ మేధ సాంకేతికత మానవ జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా "డీప్‌ఫేక్" లేదా AI జనరేటెడ్ వీడియోల ద్వారా వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సమాజానికి ఒక పెను సవాలుగా మారింది.దీనివల్ల సమాజంలో "ఏది నిజం? ఏది అబద్ధం?" అని తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. నకిలీ వార్తలు నిజం కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది.
AI వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఉన్నారు. కృత్రిమ మేధ సాంకేతికత మానవ జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా "డీప్‌ఫేక్" లేదా AI జనరేటెడ్ వీడియోల ద్వారా వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సమాజానికి ఒక పెను సవాలుగా మారింది.దీనివల్ల సమాజంలో "ఏది నిజం? ఏది అబద్ధం?" అని తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. నకిలీ వార్తలు నిజం కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది.
Claim : బైకర్ పై దాడి చేసిన చిరుతపులి ఏఐ ద్వారా సృష్టించిన వీడియో ఇది
Claimed By : Social Media Users
Fact Check : Unknown