ఫ్యాక్ట్ చెక్: హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు

ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిన వీడియో ఇది. వైరల్ వీడియోకు ఇజ్రాయెల్ కు ఎలాంటి సంబంధం లేదు. హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు

Update: 2026-03-23 02:32 GMT

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో మధ్యప్రాచ్య సంఘర్షణలు మరింత ఉద్రిక్త దశలోకి ప్రవేశించాయి. అమెరికా స్థావరాలు ఉన్న దేశాల్లోని ఇంధన కేంద్రాలు తమ లక్ష్యాలుగా మారతాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పేర్కొంది.


యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపై 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది, కానీ వాటిలో చాలా వరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల ద్వారా గాలిలోనే అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, ఈ క్షిపణులలో సుమారు 92 శాతం వాటి లక్ష్యాలను చేరకముందే అడ్డుకోవడం జరిగింది. ఈ సంఘర్షణ ప్రభావం ఇరుపక్షాలపైనా పడుతోంది. ఇరాన్‌లో, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల 81,000కు పైగా పౌరుల ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని రెడ్ క్రెసెంట్ చెబుతోంది. ఇజ్రాయెల్‌లో, ఇరాన్ దాడుల కారణంగా 2,700 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ సంస్థలు వారికి మద్దతు, ఆశ్రయం కల్పించడానికి రంగంలోకి దిగాయి.

ఇంతలో ఓ భారీ భవంతి తగలబడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక ప్రాంతంలోని అనేక ఎత్తైన భవనాలను భారీ అగ్ని చుట్టుముట్టినట్లు చూపిస్తున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. టెల్ అవీవ్‌లో ఇరాన్ జరిపిన దాడి అనంతరం జరిగిన విధ్వంసాన్ని ఈ వీడియో చూపిస్తోందని వినియోగదారులు పేర్కొన్నారు.

“టెల్ అవీవ్‌లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి, ఇజ్రాయెల్ వ్యాప్తంగా నగరాలు కంపిస్తున్నాయి. ప్రపంచమంతా చూసేలా దీన్ని షేర్ చేయండి.” అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

https://x.com/dr_iyaz/status/2033704040559935864

https://www.facebook.com/watch/?v=966271319208848
ఆర్కైవ్ లింక్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి. 

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను గూగుల్ లెన్స్ ఉపయోగించి విశ్లేషించగా, అదే వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలు ప్రచురించాయి.

'గ్రేటర్ కాశ్మీర్' ప్రచురించిన వార్తా నివేదిక మాకు కనిపించింది. అందుకు సంబంధించిన వివరాలను పరిశీలించగా, ఆ ఫుటేజ్ నవంబర్ 2025లో హాంకాంగ్‌లోని ఒక నివాస ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించినదని తేలింది.

https://www.greaterkashmir.com/latest-news/death-toll-rises-to-94-in-hong-kong-residential-building-fire-fire-department/

దీన్ని క్యూగా తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం.

నవంబర్ 2025లో హాంగ్ కాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన పలు మీడియా నివేదికలు లభించాయి. ఈ విషాద ఘటనలో 168 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. హాంగ్ కాంగ్‌లోని వాంగ్ ఫుక్ కోర్ట్ ఎస్టేట్‌లో ఏడు ఎత్తైన టవర్లను ఈ మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పడానికి దాదాపు రెండు రోజులు పట్టింది. ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదాలలో ఇది ఒకటి అంటూ పలు మీడియా సంస్థలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి, మంటలు పైకి వ్యాపించాయి. భవనాల చుట్టూ చుట్టిన స్కఫోల్డింగ్ మెష్ మంటలను మరింతగా పెంచడంతో, మంటలు ఒక టవర్ నుండి మరొక టవర్‌కు ఎగబాకాయని నివేదికల్లో తేలింది.

Full View


Full View


Full View


Full View


భారీ ప్రాణనష్టం కారణంగా నగరాన్ని శోకంలో ముంచిన ఈ విషాద సంఘటనను పలు భారతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.

ఇరాన్ దాడి తర్వాత టెల్ అవీవ్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఫుటేజ్‌గా, హాంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన పాత వీడియోను సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేశారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిన వీడియో ఇది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News