Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్ లైన్ లో టిక్కెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-16 03:19 GMT

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల18వ తేదీన మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదలచేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్ర దీపాలంకార సేవ, సాలకట్ల తెప్పోత్సవాలు, సాలకట్ల వసం తోత్సవాల టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

మార్చి నెలకు సంబంధించి...
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in 3 బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.


Tags:    

Similar News