Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2026-01-10 03:16 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి భక్తుల రద్దీతో పోల్చుకంటే నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉందని చెప్పాలి. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించిన పది రోజుల పాటు తిరుమలను సందర్శించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే నేడు భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం పూర్తవుతుంది.

సంక్రాంతి పండగ కావడంతో...
సంక్రాంతి పండగ కావడంతో పాటు వరస సెలవులు రావడతో ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. పిల్లా పాపలతో కలసి సొంతూళ్లకు వెళ్లి సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో తిరుమలకు వచ్చే వారి భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మరొకవైపు సంక్రాంతి వెళ్లే భక్తులతో ఇటు బస్సులు, అటు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుండటంతో ఎక్కువ మంది తిరుమలకు వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు.
ఏడు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్నటి వరకూ క్యూ లైన్ బయట వరకూ విస్తరించేది. నేడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయంలో పూర్తవుతుందని తిరుల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,678 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,173 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News