అమెరికాలో గుంటూరు యువతి మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి మృతి చెందారు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి మృతి చెందారు. మృతి చెందిన యువతి గుంటూరు వాసి దీప్తిగా గుర్తించారు. స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టెక్సాస్ లో ఎంఎస్ చేస్తున్న విద్యార్థిని దీప్తి అకాల మరణంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
గుంటూరుకు తీసుకువచ్చేందుకు...
దీప్తి మృతదేహం గుంటూరుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అతని సోదరుడు రవి చర్యలు చేపట్టారు. టెక్సాస్ లో ఈ ప్రమాదం జరిగింది. నెల రోజుల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని పట్టా తీసుకుని తిరిగి వస్తుందని అనుకుంటున్న సమయంలో దీప్తి మరణం ఆ కుటుంబంలో విషాదం నింంపింది. ఈ నెల 12వ తేదీన టెక్సాస్ లో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.