అమెరికాలో ఏపీకి చెందిన యువకుడు మృతి
అమెరికాలో బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. బాపట్ల జిల్లాలోని మార్టూరు యువకుడు పాటిబండ్ల లోకేశ్ మృతి చెందినట్లు సమాచారం అందింది
అమెరికాలో బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. బాపట్ల జిల్లాలోని మార్టూరు యువకుడు పాటిబండ్ల లోకేశ్ మృతి చెందినట్లు సమాచారం అందింది. లోకేష్ అమెరికాలోని బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గురువారం రాత్రి మార్టూరు లోని కుటుంబ సభ్యులకు లోకేశ్ ఈత కొలనులో పడి మృతిచెందినట్లు సమాచారం అందింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి లోకేశ్ మృతి చెందాడు.
బాపట్ల జిల్లాలోని మార్టూరు...
ఈతకొలనుకు వెళ్లిన లోకేష్ అందులో పడి మరణించారని అమెరికా పోలీసులు సమాచారం అందించారు. దీంతో మార్టూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, కేంద్ర, రాష్ట్రర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీలయినంత త్వరగా మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకు రావాలని కోరుతున్నారు.