ప్రియురాలితో గొడవ.. ఇన్ స్టా లైవ్ లో యువకుడి ఆత్మహత్య

కొద్దిరోజుల క్రితమే అతను ముంబై నుండి ఫతేగంజ్ లో స్వగ్రామమైన పీఆర్ ధోబిన్ పూర్వా గ్రామానికి వచ్చాడు. పాథాలజీలో పనిచేస్తున్న

Update: 2023-04-09 13:01 GMT

uttarpradesh young man suicide

క్షణిక ఆవేశంలో యువత బలవన్మరణాలకు పాల్పడుతూ.. కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తోంది. ప్రేమ విఫలమైందనో, తల్లిదండ్రులు మందలించారనో ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా యూపీలోని బండాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ అయిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని లైవ్ లో చూసిన స్నేహితులు నీకు మేమున్నాం.. తొందరపడకు అని రిక్వెస్ట్ చేసినా వినకుండా తనువు చాలించాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు రాహుల్ శ్రీవాస్తవ(30) ముంబైలో పెయింటింగ్ పని చేసేవాడు. కొద్దిరోజుల క్రితమే అతను ముంబై నుండి ఫతేగంజ్ లో స్వగ్రామమైన పీఆర్ ధోబిన్ పూర్వా గ్రామానికి వచ్చాడు. పాథాలజీలో పనిచేస్తున్న ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థినితో రాహుల్ ప్రేమలో ఉన్నాడు. ఆమెను కలిసేందుకు ముంబై నుండి బండాకు వచ్చి అక్కడి హోటల్ లో ఉన్నాడు. ప్రియురాలితో సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఫోన్‌లో మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ యువకుడు మద్యం సేవించాడు. ఆత్మహత్య పాల్పడడానికి ముందు సోషల్ మీడియాలో రెండు వేర్వేరు పోస్టులు చేశాడు. అందులో ఒకదానిలో ‘ఈ రోజు నేను అందరికి గుడ్ బై చెబుతున్నా అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.
అనంతరం.. అటార్రా తహసీల్ లోని హోటల్ లో ఇన్ స్టా లైవ్ పెట్టిమరీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ లో రాహుల్ ని చూసిన అతుల్.. తన స్నేహితులందరికీ ఫోన్ చేసి విషయం చెప్పగా.. వారంతా ఆ లైవ్ లోకి వచ్చారు. రాహుల్ సూసైడ్ చేసుకుంటున్న సమయంలో స్నేహితులందరూ గమనిస్తూనే ఉన్నారు. అందరూ అతనిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాహుల్ ఆత్మహత్యను ఓ స్నేహితుడు లైవ్ వీడియో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో అది వైరల్ అయింది. ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన మరోపోస్ట్‌లో ‘తల్లిదండ్రులు తనని క్షమించమని కోరాడు. తాను చాలా నిస్సహాయంగా ఉన్నానని తనకు చావు తప్ప వేరే మార్గం లేదని.. చనిపోతున్నట్లు సోదరుడికి కూడా కామెంట్ చేశాడు. ఈ అంశాలన్నింటినీ పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హోటల్ గదిలో మద్యం బాటిల్, మొబైల్ ఫోన్, టీ షర్టు, బట్టలు, సిగరెట్ పెట్టెలను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకున్నారు.



Tags:    

Similar News