Murder : వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తనే భార్య ప్రియుడితో కలసి హత్య చేసింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది

Update: 2025-04-17 04:09 GMT

అక్రమ సంబంధాలతో ఇటీవల కాలంలో భార్యలు కట్టుకున్నభర్తలనే హతమారుస్తున్నారు. అనేకచోట్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం కోసం భర్తను కడతేర్చడం చాలా సులువుగా చేసేస్తున్నారు. తాళికట్టిన భర్తను తన చేతులతోనే చంపేస్తూ ప్రియుడితో కలసి ఎంజాయ్ చేసేందుకు కొందరు యువతులు నిర్ణయించుకోవడంతో ఈ తరహా హత్యలు ఇటీవల కాలంలో భారత్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా హర్యానాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ హత్య కేసును ఛేదించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా...
హర్యానాలోని భివానీలో ప్రవీణ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 2017లో రవీనాతో వివాహమయింది. వీరిద్దరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో బిజీగా ఉన్న రవీనా సొంతంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసింది. ఈ యూట్యూబ్ ఛానల్ కు నలభై వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న రవీనాకు హిసార్ కు చెందిన మరో యూట్యూబర్ సురేశ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం విహాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇద్దరూ కనిపించడంతో...
రవీనా, సురేశ్ లు మార్చి ఒకటో తేదీన ఇంట్లో కనిపించడంతో అక్కడకు వచ్చిన భర్త ప్రవీణ్ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో వెంటనే ఇద్దరూ ప్రవీణ్ పై దాడికి దిగారు. రవీనా తన చున్నీతో ప్రవీణ్ గొంతు కు వేసి బిగించగా, సురేష్ ప్రవీణ్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఇద్దరూ ఒక కాల్వలో పడేశారు. కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఏడని అడిగితే పొంతన లేని సమాధానం రవీనా ఇచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా రవీనా తాము చేసిన హత్యను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News