మనం అలా దొరికిపోకూడదని మాట్లాడుకుని మరీ దొరికిపోయారు!!

సర్వేయర్ తేజేశ్వర్‌ హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు చాలా విషయాలను మాట్లాడుకున్నారు.

Update: 2025-06-27 11:30 GMT

సర్వేయర్ తేజేశ్వర్‌ హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు చాలా విషయాలను మాట్లాడుకున్నారు. మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ ఘటనలో దొరికిపోయినట్లుగా, మనం ఎలాంటి పొరపాటు జరగకుండా పక్కాగా పనికానిచ్చేద్దామని తేజేశ్వర్‌ హత్య కోసం ఆయన భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు మాట్లాడుకున్నారు. తేజేశ్వర్‌ను చంపిన తర్వాత ఇద్దరూ లద్ధాఖ్‌కు హనీమూన్‌ వెళ్లాలనీ అనుకున్నారు. హత్య ఆలస్యమైతే ఆషాఢమాసంలో అండమాన్‌ లేదా మరే ఇతర ప్రాంతానికైనా విహారానికి వెళ్లాలని కూడా అనుకున్నారు. కర్నూలుకు చెందిన తిరుమలరావు వివాహితుడు. బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే స్వీపర్‌ సుజాతకు హోమ్‌ లోన్‌ ఇప్పించి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె కూతురు ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు.

Tags:    

Similar News