కారు డోర్ లాక్ అయి నలుగురు చిన్నారుల మృతి

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కారులో చిక్కుకుని చిన్నారులు నలుగురు మరణించారు

Update: 2025-05-19 06:20 GMT

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కారులో చిక్కుకుని చిన్నారులు నలుగురు మరణించారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు కారులో ఎక్కి ఆడుకుంటుండగా డోర్ లాక్ అయి ఊపిరాడక మరణించారు. ద్వారపూడికి చెందిన జాశ్రిత, చారుమతి, మనిశ్విని, ఉదయ్ నలుగురు స్నేహితులుగా ఉంటూ వేసవి సెలవుల్లో ఇంటి ముందు ఉన్న కారులోకి ఎక్కి ఆడుకుంటున్నారు. నిలిపి ఉంచిన కారులోకి ఎక్కడంతో వెంటనే డోర్ లాక్ అయింది.

ఊపిరాడకపోవడంతో...
దీంతో ఊపిరాడని వారు నలుగురూ మరణించారు. పక్కనే వివాహ వేడుక జరుగుతుండటంతో డీజే సౌండ్ల మధ్య పిల్లల అరుపులు, కేకలు వినిపించకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. సాయంత్రం వరకూ చిన్నారులు కారులోనే ఉండిపోయారు. వారి కోసం అన్నిచోట్ల వెదికిన తల్లిదండ్రులు, బంధువులకు చివరకు కారులో శవమై కనిపించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.


Tags:    

Similar News