నిద్రిస్తున్న వారిపై నుంచి వెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

Update: 2022-03-22 04:26 GMT

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఒక భవనం ముందు నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ వెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

బీహార్ కు చెందిన....
నిద్రిస్తున్న భవన నిర్మాణ కార్మికులు చందన్ రామ్, చందన్ కుమార్ సహారీలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీరిద్దరూ బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో నిద్రిస్తున్న వీరిపై నుంచి ఐరన్ లోడు తో వచ్చిన లారీ రివర్స్ లో చూసుకోకుండా వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Tags:    

Similar News