క్యూనెట్ కేసులో సీసీఎస్‌ పోలీసుల సోదాలు

మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో సీసీఎస్‌ పోలీసుల సోదాలు చేశారు

Update: 2026-03-23 05:29 GMT

మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో సీసీఎస్‌ పోలీసుల సోదాలు చేశారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఏకకాలంలో సోదాలను హైదరాబాద్ పోలీసులు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇరవై మందిని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మూడు రాష్ట్రాలలో...
మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూ నెట్ పలువురిని మోసం చేసిందన్న ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ఇటీవల నమోదైన కేసుల ఆధారంగా 25 పోలీసు బృందాల సోదాలు జరుపుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News