America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించినిట్లు అధికారులు ధృవీకరించారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించనిట్లు అధికారులు ధృవీకరించారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని నార్త్ కొరడస్ టౌన్ షిప్ లోకి ఒక దుండగుడు చొరబడి ఈ కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపే నిందితుడిని పట్లుకునేందుకు వెళ్లిన వారిలో ముగ్గురి పోలీసులు మరణించారు.
పోలీసు కాల్పుల్లో దుండగుడు...
ఈ కాల్పుల ఘటనలో మరో ఇద్దరికీ గాయాలు అయినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ తర్వాత కాల్పులకు తెగపడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారని అధికారులు తెలిపారు. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు? అతను ఎవరు? అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.