Murder Case : భార్య చేతిలో భర్త హతం.. ప్రియుడి కోసమే మర్డర్

బీహార్ లోని సమస్తిపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ సోనుకుమార్ భార్య స్మితాదేవి తన ప్రియుడితో కలసి హత్య చేసింది

Update: 2025-07-28 05:44 GMT

భర్తలను చంపే భార్యల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ తరహా హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రియుడితో కలసి కట్టుకున్నోడిని హతమార్చిన ఘటనలు వరసగా దేశంలో జరుగుతుండటం కలకలం రేపుతుంది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో ప్రారంభమయిన ఈ తరహా హత్యలు మరింత ఎక్కువయ్యాయి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా భార్యలే భర్తలను అతి కిరాతకంగా మారుస్తున్నారు. వైఫ్ లు నైఫ్ లుగా మారి హతమారుస్తున్నారు. తాజాగా మరొక భర్త భార్య చేతితో హతమయ్యాడు. ఈ హత్యలో భార్యకు ఆమె లవర్ సహకరించాడు. బీహార్ లో జరిగిన ఘటన సంచలనం కలిగించింది.

సమస్తిపూర్ కు చెందిన...
బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ సోనుకుమార్ కు వివాహమయింది. ఐదేళ్ల క్రితం స్మితాదేవితో వివాహం జరిగింది. అయితే స్మితా దేవి మాత్రం తన పుట్టింట్లో ఉండాలని, తల్లి ఇంటివద్దనే ఉండాలని కోరుతుంది. దీనికి సోనుకుమార్ అంగీకరించలేదు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో గ్రామ పెద్దల ఎదుట పంచాయతీ కూడా జరిగింది. చివరకు అక్కడే ఉండటానికి ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే అయితే తమ పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చే హరి ఓంతో స్మితాదేవికి పరిచయం అయింది. అది ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది.
మందలించడంతో...
ఈ విషయం తెలిసిన సోనూ కుమార్ భార్యను మందలించాడు. ఆటో కు ప్రయాణికులు ఎక్కువ కావడంతో ఇంటికి ఆలస్యంగా వచ్చిన సోనుకుమార్ కు అతని భార్య స్మితతో పాటు ప్రియుడు హరిఓం ను చూడలేని స్థితిలో చూశాడు. దీంతో సోనూ కుమార్ ఇద్దరినీ మందలించి పంపించి వేశాడు. తర్వాత సోనుకుమార్ తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. స్మిత అతని ప్రియుడు కలసి హత్య చేశారని, వారికి మరో ఇద్దరు సహకరించారని సోనుకుమార్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు స్మితను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. హరి ఓం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










Tags:    

Similar News