యాచకురాలి ఇంట్లో షాకింగ్ దృశ్యాలు..బంగారం.. నగదు

యాచనచేసే ఒక మహిళ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి

Update: 2025-02-06 07:48 GMT

యాచనచేసే ఒక మహిళ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బీహార్ లో జరిగిన ఈ ఘటనతో ఒక యాచకురాలి ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు,బంగారు ఆభరణాలు దొరకడంతో పోలీసులు కంగు తిన్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన నీలందేవి యాచక వృత్తి చేస్తూ ఉంటారు.

దొంగతనం ఆరోపణలపై..
అయితే దొంగతనం ఆరోపణలపై నీలందేవి ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా లక్ష రూపాయలు ఖరీదు చేసే బైకుతో పాటు పన్నెండు ఖరీదైన ఫోన్లను పోలీసులు గుర్తించారు. పలు దేశాలకుచెందిన వెండి, బంగారు ఆభరణాలను సయితం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలందేవి బిక్షాటన చేస్తూ ఇళ్ల వద్ద రెక్కీ చేస్తూ తన అల్లుడికి సమాచారం ఇచ్చేదని, తర్వాత ఆమె అల్లుడు అక్కడకు వెళ్లి దొంగతనం చేసేవాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నీలందేవిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అల్లుడు పరారీలో ఉన్నారు.


Tags:    

Similar News