Road Accident : వేగంగా వచ్చి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు

Update: 2025-08-04 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు యువకులు వెళుతున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ములకల చెరువుల మండలం కట్టవాండ్ల పల్లి వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...
దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన ముగ్గురు యువకులను వెంకటేష్, తరుణ్, మనోజ్ లుగా గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News