గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళల మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు

Update: 2025-02-17 02:44 GMT

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆటోను ఢీకొట్టడంతో...
నారా కోడూరు - బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టిని వాహనం వెంటనే వెళ్లిపోవడంతో వాహనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News