Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడపశివారులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడపశివారులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు-లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. అరుణాచలం, తిరుమల క్షేత్రాలను దర్శించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు.
మృతులు వీరే...
ప్రమాదంలో ఉదయ్ కుమార్, హుస్సేనమ్మ మృతి చెందారని పోలీసులు గుర్తించారు. మృతులు ఆర్లగడ్డ లింగాలదిన్నె గ్రామవాసులుగా తెలిసింది. గాయపడినవారిలో రెండేళ్ల బాలిక ఉంది. గాయపడిన వారిని చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.