Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.

Update: 2025-02-26 02:41 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురు మరణించారు. కరూర్ జిల్లా కుళితలైలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బస్సును ఢీకొన్న వెంటనే కారులో మంటలు వ్యాపించాయి.

బస్సును ఢీకొని..
దీంతో కరూర్ జిల్లా లోని జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. దాదాపు గంటల సేపు శ్రమించి కారులో ఉన్న మృతదేహలను పోలీసులు బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. రహదారిపై నుంచి కారును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News