Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తిరుపతికి సమీపంలోని పాకాల మండలం తోటపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై వెళుతన్న కారు ముందున్న కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కారు అతి వేగంగా వచ్చి కంటైనర్ కిందకు దూసుకెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
అందరూ తమిళనాడు వాసులే...
ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులందరూ తమిళనాడుకు చెందిన కృష్ణగిరి వాసులుగా గుర్తించారు. మృత్తులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.