ర్యాడిసన్ హోటల్ లైసెన్సు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

ర్యాడిసన్ హోటల్ 24 గంటలు లిక్కర్ సప్లై చేసేందుకు 2బీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అనుమతి తీసుకుంది. అందుకు రూ.56 లక్షల ట్యాక్స్

Update: 2022-04-05 06:03 GMT

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై శనివారం (ఏప్రిల్ 2) అర్థరాత్రి పోలీసులు దాడి జరపగా.. పబ్ లో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 150 మంది వరకూ ఉండగా.. వారందరినీ విచారించి.. ఆఖరికి ముగ్గురిపై కేసు పెట్టి, నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఎక్సైజ్ శాఖ చర్యలు ప్రారంభించింది. పబ్ లైసెన్సునుతో పాటు, ర్యాడిసన్ హోటల్ లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేసింది.

ర్యాడిసన్ హోటల్ 24 గంటలు లిక్కర్ సప్లై చేసేందుకు 2బీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అనుమతి తీసుకుంది. అందుకు రూ.56 లక్షల ట్యాక్స్ కూడా చెల్లించింది. హోటల్ లో పబ్ నిర్వహిస్తూ.. అడ్డగోలుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు బయటపడటంతో ఎక్సైజ్ శాఖ వాటి లైసెన్సును రద్దు చేసింది. ఈ కేసులో పలువురు వీఐపీల పిల్లలు ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు డ్రగ్స్ కేసుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలేది లేదని హెచ్చరించారు. పుడింగ్ అండ్ మింక్ వ్యవహారంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.


Tags:    

Similar News