మంత్రి హత్యకు కుట్ర కేసు... కోర్టు కేసులకే నాలుగు కోట్లు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి

Update: 2022-03-04 04:14 GMT

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. తమను ఆర్థికంగా శ్రీనివాస్ గౌడ్ ఎదగనివ్వడం లేదని రాఘవేంద్ర రాజు బ్రదర్స్ భావించారు. శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేస్తే తప్ప తాము ఆర్థికంగా నిలదొక్కుకోలేమని భావించిన రాఘవేంద్ర రాజు మంత్రి హత్యకు కుట్ర పన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నందుకే...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫడవిట్ లో తప్పులు చేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రాఘవేంద్ర రాజు నాలుగు కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జిరాక్స్ కాపీల కోసమే 18 లక్షలు వెచ్చించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు అతని అనుచరులు తనను వేధిస్తున్నారని రాఘవేంద్ర రాజు పోలీసులకు చెప్పారు. రాజకీయంగా తనను ఆయన అడ్డుకుంటున్నందుకే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు రాఘవేంద్ర రాజు పోలీసులకు చెప్పారు.


Tags:    

Similar News