తుని అత్యాచారం నిందితుడు చెరువులోకి దూకి?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణరావు చెరువులో దూకాడు
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణరావు చెరువులో దూకాడు. నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. బాలికపై అత్యాచారం కేసులో నారాయణరావును పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసుతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఈరోజు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా మార్గ మద్యంలో కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ నారాయణరావు కోరారు. దీంతో వాహనాన్ని నిలిపిన పోలీసుల అందుకు అనుమతించారు.
మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళుతుండగా...
అయితే నారాయణరావు పక్కనే ఉన్న చెరువు వైపు పరిగెత్తిన నారాయణరావు అందులో దూకి చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పారిపోయే ప్రయత్నంలోనే ఈత రాకపోయినప్పటికీ చెరువులో దూకి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరావు కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. నారాయణరావుకు ఈతరాదని చెబుతున్నారు. దీంతో ఆయన చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇది మరో కోణంలో జరిగిందా? అన్న రీతిలో ప్రచారం సాగుతుంది.