బావిలో పడిన కారు..యువకుడు మృతి

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒక యువకుడు జలసమాధి అయ్యాడు

Update: 2026-01-13 04:28 GMT

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒక యువకుడు జలసమాధి అయ్యాడు. మానకొండూరు మండలం ఉట్నూరు గ్రామానికి చెందిన సంగంరాజుగా పోలీసులు గుర్తించారు. అయితే రాజు కారులో బయలుదేని సంక్రాంతి పండగకు సొంత గ్రామానికి చేరుకోవాలనుకున్నాడు. తన తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. రాజు ఇంటికీ రాకపోవడంతో ఆయన తల్లి స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా...
రాజు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రాజు ప్రయాణిస్తున్న కారు బావిలో పడినట్లు గుర్తించారు. దీంతో కారును బావి నుంచి బయటకు తీయడానికి గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. నిన్న అర్ధరాత్రి కారును బయటకు తీశారు. అయితే కారు అదుపు తప్పి వేగురుపల్లిలోని వ్యవసాయ బావిలో పడినట్లు తెలిసింది. రాజు తండ్రి కూడా వ్యవసాయ బావిలో పడి గతంలో చనిపోయిన ఘటనను గుర్తు చేసుకుంటూ తల్లి స్వరూప రోదిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తుంది.


Tags:    

Similar News