Murder Case Kukatpally : కూకట్ పల్లి బాలిక హత్య కేసులో ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడా?

కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో మిస్టరీ వీడటం లేదు. హంతకుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆధారాలు దొరకకుండా హత్య చేశాడు

Update: 2025-08-22 05:37 GMT

కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో మిస్టరీ వీడటం లేదు. హంతకుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆధారాలు దొరకకుండా పోలీసుల కన్ను గప్పి ఈ హత్య చేసినట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. కూకట్ పల్లిలో బాలిక హత్య జరిగి ఐదు రోజులు గడిచినా ఇంకా నిందితుడి ఆచూకీ లభించలేదు. హత్య చేసిందెవరు? కారణాలేమిటి? బాలికపై పద్దెనిమిది కత్తిపోట్లు వేయడానికి కారణామేంటి? అంత కసి హంతకుడిలో బాలికపై ఎందుకు ఉంది? బాలికపైన కక్షా లేక తల్లిదండ్రులపైన కసా? అన్నది తెలియాల్సిఉండగా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో కూకట్ పల్లి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అనుమానితులను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

అనేక మంది అనుమానితులను...
ఇప్పటికే బాలిక బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో పాటు అనుమానితులను విచారించిన కూకట్‌పల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో బాలిక హత్య కేసు మిస్టరీగానే మిగులుతుందా? అన్న అనుమానాలు బయలుదేరాయి. హైదరాబాద్ కూకట్ పల్లిలో బాలిక హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కూకట్ పల్లిలో బాలిక హత్య కేసు సంచలనం కలిగించింది. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన అదను చూసి నిందితుడు దాడి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే కొత్త వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాలేదని పోలీసులు గుర్తించారు.
ఒక మహిళ అక్కడ తిరుగుతూ...
కూకట్ పల్లి పోలీసులు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. డాగ్ స్వ్కాడ్ ను కూడా రప్పించి నిందితుడి కోసం వెతికారు. కానీ ఎటువంటి ఆధారాలు లభించడం లేదు. సీసీటీవీ ఫుటేజీలో మాత్రం ఒక మహిళ అక్కడ పలుమార్లు తచ్చాడుతున్నట్లు కనిపించిందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటి వకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారని, తాము పోలీసుల విచారణకు సహకరిస్తున్నామని, సోషల్ మీడియాలో తమపైన వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేస్తుండటాన్ని వారు ఖండిస్తున్నారు. అసలు నిందితుడు ఎవరో తేలేంత వరకూ తాము పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటామని వారు అంటున్నారు. పోలీసులు మాత్రం కేసు దర్యాప్తులో ఉందని, అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించామని, త్వరలోనే ఒక కన్ క్లూజన్ కు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News