Murder Case : నమ్మించి పని ఇస్తే.. ఊపిరి తీసేసింది.. ఈ మర్డర్ వెనక మరేదైనా కుట్ర ఉందా?

విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్ రామారావు హత్య సంచలనం కలిగించింది.

Update: 2025-07-12 05:46 GMT

విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్ రామారావు హత్య సంచలనం కలిగించింది. కేర్ టేకర్ గా చేర్చుకుని మంచి జీతం ఇస్తూ తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటుందని భావించిన రామారావుకు ఆ కేర్ టేకర్ విలన్ గా మారింది. పనిలో చేరిన కేవలం ఐదు రోజుల్లోనే మర్డర్ కు ప్లాన్ చేసిందంటే ముందు నుంచి పథకం ప్రకారం ఈ ఇంట్లో చేరిందా? అన్న అనుమానాలు అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పనిమనుషులు అన్ని గమనించి హత్య చేయడానికి తగిన సమయం తీసుకుంటారని, ఎవరెవరు? ఏ టైంలో వచ్చిపోతుంటారు? ఇంట్లో మర్డర్ చేసే సమయం ఇలా అన్నీ లెక్కలు వేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటారని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంత తక్కువ టైంలో మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిందంటే ముందు నుంచి పథకంపన్ని ఈ పనిలో చేరినట్లు అనుమానించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

డబ్బుకోసమేనా?
67 ఏళ్ల రిటైర్ ఇంజినీర్ రామారావు విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్నారు. 95 ఏళ్ల తన తల్లిని గతంలో ఒక మహిళ చూసుకునేది. ఆ మహిళ మానేయడంతో తన తల్లిని చూసుకునేందుకు బ్రో్కర్ ను సంప్రదించగా అనూష అనే మహిళను పంపించారు. రామారావు అనూషను తన తల్లికి ఏమేం సేవలు అందించాలో చెప్పి బయటకు వెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి రామారావు హత్యకు గురవ్వడం ఆ కాలనీవాసులకు ఆశ్చర్యానికి గురి చేసింది. రామారావు కాలనీ కమిటీలో యాక్టివ్ మెంబర్ గా ఉంటారు. అయితే రామారావు తల్లి సరస్వతిని చూసుకునే కేర్ టేకర్ అనూష ప్రతి రోజూ సరస్వతి గదిలోనే నిద్రించేది. అయితే గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సరస్వతికి మెలుకువ వచ్చి చూడగా సరస్వతి కనిపించ లేదు. దీంతో అనుమానం వచ్చిన సరస్వతి రామారావు గదిలోకి వెళ్లి చూడగా ఆయన అచేతనావస్థలో పడి ఉండటం గమనించింది.
తెలంగాణకు చెందిన...
ముఖంపై కారం చల్లి ఉంది. గది తలుపు తెరిచి లైట్లు వేసి ఉండటంతో పాటు సరస్వతి కనిపించక పోవడంతో అనుమానం వచ్చి స్థానికులను పిలవగా రామారావు హత్యకు గురయినట్లు నిర్ధారించారు. అయితే అనూష ఈ హత్యకు తన ప్రియుడితో కలసి ప్లాన్ చేసింది. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన అనూష తన భర్తకు దూరంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాకుచెందిన ఉపేంద్రతో కలసి గుంటూరు జిల్లా నులకపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లి రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి వచ్చారు. అర్ధరాత్రి మరొక వ్యక్తి రామారావు ఇంటికి ఆటోలో వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. వారిద్దరూ కలసి రామారావును హత్య చేసి ఉంటారని పోలీసులు విచారణ చేస్తున్నారు.
నగదు, ఆస్తి పత్రాలతో...
రామారావు బీరువాలోని 90 వేల రూపాయల నగదుతో పాటు చీరలు, ఆస్తి పత్రాలు కూడా కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ వాటిని తీసుకుని పరారయినట్లు తెలిసింది. ఇద్దరూ ఆటోలో నులకపేటకు చేరుకుని అక్కడ నుంచి తమ ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకుని విజయవాడ వచ్చి అక్కడి నుంచి తిరుపతి బస్సు ఎక్కినట్లు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తెలుసుకున్నారు. అయితే రామారావుకు ఆస్తివివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనూష, ఉపేంద్ర ల కోసం ప్రత్యేక బృందాలు తిరుపతికి వెళ్లాయి. కొన్ని బృందాలు మిగిలిన ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద విజయవాడలో జరిగిన ఈహత్య సంచలనం కలిగిస్తుంది. కేర్ టేకర్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News