దొంగిలించిన సొమ్ముతో బట్టలు కూడా కొనుక్కోలేదు.. అదే అతనిని పట్టించిందిగా?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సురేష్ మోరీ విజయవాడలో దొరికిపోయాడు.

Update: 2025-07-16 03:52 GMT

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ విజయవాడలో దొరికిపోయాడు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా నాలుగేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరగాడు చివరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు పట్టుకున్నారు. అదే సమయంలో ఆ క్రిమినల్ కక్కుర్తి కూడా పోలీసులకు పట్టిచ్చినట్లయింది. దోచుకున్న సొమ్ముతో కనీసం దొంగతనం చేసే సమయంలో వేసుకున్న డ్రెస్స్లులు కూడా మార్చకపోవడంతో పోలీసులు సులువుగా పట్టుకోవడానికి ఊతమిచ్చినట్లయింది. ముంబయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సురేష్ మోరీ చివరకు బెజవాడ పోలీసులకు సులువుగా దొరికిపోయాడు.

తాళాలు వేసిన ఇళ్లలోనే...
సురేష్ మోరీ దొంగతనాలు పెక్యులర్ గా ఉంటాయి. తాళాలు వేసిన ఇళ్లలోనే చోరీలు చేస్తుంటాడు. భారీగా బంగారం, నగదు ను దోచుకెళతాడు. చూసేందుకు ఎవరికీ అనుమానం కలగదు. తాళాలు సులువుగా పగలుకొట్టేస్తాడు. వరస నేరాలు చేస్తున్నా అతను పోలీసులకు పట్టుబడటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడ్డాడు. గతంలో ముంబయిలో అనేక దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కినా అనారోగ్యం కారణం చెప్పి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఒకచోట దొంగతనం చేస్తే మకాం వేరే ఊరికి మారుస్తాడు. మళ్లీ ఆ ఊరికి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి వస్తాడు. ఇది మనోడి దొంగతనం స్టయిల్. అదే చివరకు సురేష్ మోరీని పట్టించింది.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా...
జూన్ నెలలో విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం జరిగింది. పదిహేను బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును చోరీ చేశాడు. అయితే ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరా పుటేజీని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపు భవానీపురంలో మరో దొంగతనం జరిగింది. అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లాడు. అక్కడ దొంగతనం చేసి తిరిగి గుంటూరుకు చేరుకున్నాడు. అయితే ఈ దొంగతనాలు చేసే సమయంలో ఒకే చొక్కా, ఒకే రంగు ప్యాంటు వేసుకోవడంతో పోలీసులు సులువుగా గుర్తించారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో ఉన్న సురేష్ మోరీని అరెస్ట్ చేసి విచారించారు. నేరాలు చేసినట్లు అంటీకరించారు. గుంటూరులోనూ నాలుగు నేరాలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ముంబయిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న సురేష్ మోరీ చివరకు బెజవాడ పోలీసులకు దొరికపోయాడు.


Tags:    

Similar News