హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు

Update: 2025-01-18 02:46 GMT

హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట వద్ద రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనకనుంచి ఢీకొన్న మరో ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.

పొగమంచు కారణంగానే...
గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచు, అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతులను గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News