డీజీపీ హత్య.. కారణం ఏంటంటే?

జమ్ము కాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు.

Update: 2022-10-04 02:58 GMT

జమ్ము కాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంట్లో పనిమనిషే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పనిమనిషి పరారీలో ఉన్నాడు. అయితే ఈ హత్యకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ప్రకటించింది. డీజీపీ లోహియాను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. హత్య జరగడానికి ముందు ఏం జరిగిందన్న దానిపై లోతుగా విచారిస్తున్నామని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముకేష్ సింగ్ తెలిపారు.

హత్యకు ముందు...
హత్యకు గురి కావడానికి ముందు హేమంత్ కుమార్ లోహియా పాదం వాచిందన్నారు. ఇందుకోసం ఆయన ఏదో నూనె రాసుకున్నట్లుగా అర్థమవుతుందన్నారు. లోహియాకు ఊపిరి ఆడకుండా చేసి సీసాతో నిందితుడు గొంతు కోశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు మాత్రం ఏమై ఉంటాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. హేమంత్ కుమార్ లోహియా 1992 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ ఏడాది ఆగస్టు నెలలో జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలను చేపట్టారు.


Tags:    

Similar News