ఈ లేడీ లీడర్.. భారత్ లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిందంటే ఎవరైనా నమ్ముతారా?

ఉగ్రవాదులతో సంబంధాలున్నమరో యువతిని గుజరాత్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-07-31 06:49 GMT

ఉగ్రవాదులతో సంబంధాలున్నమరో యువతిని గుజరాత్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. షామాపర్వీన్ అనేమహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షామా పర్వీన్ కు ఉగ్రవాద సంస్థ అయిన ఆలైఖైదా అనుబంధ సంస్థతో సంబంధాలున్నాయని భావించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన షామా పర్వీన్ ను బెంగళూరు నుంచి గుజరాత్ కు తరలించి విచారణ చేస్తున్నారు. భారత్ లో ఉంటూ ఉగ్రవాదులకు సహాయ సహాకారాలను అందిస్తున్న వారిని పట్టుకునేందుకు ఇటీవల కాలంలో పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది ఇలాంటి కేసుల్లో అరెస్టయ్యారు కూడా.

సోషల్ మీడియాలో యాప్ ద్వారా...
ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ గ్రూపుతో సంబంధమున్నమహ్మద్ ఫర్డీన్, సెపుల్లా ఖురేషి. జిషన్ ఆలీ, మహ్మద్ షైక్ లను ఈ నెల 23వ తేదీన గుజరాత్, ఢిల్లీల్లో అరెస్ట్ చేశారు. వీరందరూ కలసి సోషల్ మీడియాలో యాప్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉగ్రవాదులకు సహకారం అందిస్తూనే దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడయింది. అనేక చోట్ల ఉగ్రదాడులు నిర్వహించాలని ఈ గ్రూప్ పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
బెంగళూరులో ఉంటూ...
అయితే ఈ గ్రూపు మొత్తానికి షామా పర్వాన్ నాయకత్వం వహిస్తున్నట్లు కూడా తేలింది. స్లీపర్ సెల్స్ విభాగాలతోనూ, ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖైదా అనుబంధ సంస్థలతోనూ వీరికి సంబంధాలున్నాయని గుర్తించారు. దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారని కూడా కనుగొన్నారు. ఝార్ఖండ్ కు చెందిన షామా పర్వీన్ నాలుగేళ్లుగా బెంగళూరులోనే ఉంటూ యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నట్లు వెల్లడయింది. గతంలో షామా పర్వీన్ హైదరాబాద్ లోనూ కొంత కాలం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరంతా ఎక్కడెక్కడ ఉగ్రదాడులు నిర్వహించాలన్న ప్లాన్ చేశారన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ గ్యాంగ్ లో ఉన్న మరికొందరికోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News