ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురి అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్ అయ్యారు

Update: 2025-11-20 11:58 GMT

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు శ్రీనగర్ లో వారిని అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు లో పదిహేను మంది మరణించిన సంగతి తెలిసిందే.

శ్రీనగర్ లో వారిని...
ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారంతా పుల్వామాకు చెందిన వారు. నిందితులు పుల్వామాకు చెందిన డా.ముజమ్మిల్ షకీల్‌, అనంతనాగ్ కు చెందిన డాక్టర్ అదీల్, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్‌ , ఇర్ఫాన్‌ లను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని కారు బ్లాస్ట్ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారు.


Tags:    

Similar News