ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త అరెస్ట్

వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై

Update: 2022-12-24 03:27 GMT

cbi arrests chanda kochhar 

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టుగా వీరిపై కేసు నమోదవ్వగా.. వారిద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు నేపథ్యంలో 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ బాధ్యతల నుండి చందా కొచ్చర్ వైదొలిగారు.

2012లో వీడియోకాన్ గ్రూప్ కు రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు చందా కొచ్చర్. వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి. రుణం తీసుకున్న తర్వాత వీడియోకాన్ సరైన చెల్లింపులు జరపలేదు. ఈ విషయంలో బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ చందా కొచ్చర్ పై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం భారీగా లబ్ధి పొందిందని ఆరోపిస్తోంది.
వీడియోకాన్ సంస్థ ఛైర్మన్ వేణుగోపాల్ దూత్, దీపక్ కొచ్చర్ స్థాపించిన న్యూ పవర్ అనే ఒక ఎనర్జీ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఐసీఐసీఐ నుంచి రుణం పొందిన తర్వాత, దీపక్ కొచ్చర్ సంస్థలోకి ఈ నిధులు రావడం విశేషం. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ అధినేత అక్రమంగా రుణం తీసుకుని, చందా కొచ్చర్ సంస్థలో పెట్టుబడులు పెట్టాడని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో తాజాగా చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్ను సీబీఐ అరెస్టు చేసింది.




Tags:    

Similar News