వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధం మరో హత్యకు కారణమయింది. కడప జిల్లాలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది

Update: 2025-07-19 03:40 GMT

వివాహేతర సంబంధం మరో హత్యకు కారణమయింది. కడప జిల్లాలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడు లో భార్య సుజాతను హత్య చేసి భర్త స్టేషన్ లో లొంగిపోయారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు చెబుతన్నారు. భర్త గోపాల్ వృత్తి రీత్యా ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా ఉన్నాడు.

వద్దని చెప్పినా వినకుండా....
అక్రమ సంబంధం వద్దని ఎన్నిసార్లు చెప్పిన వినకపోవడం తో భార్య ను హత్య చేసినట్లు గోపాల్ పోలీసలు విచారణలో అంగీకరించాడు. రెండు రోజులు క్రితం హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి వనిపెంట అటవీప్రాంతంలో వేసినట్లు పోలీసులకు భర్త గోపాల్ సమాచారం ఇచ్చారు. మృతదేహం కోసం అడవిలో చాపాడు పోలీసులు వెదుకుతున్నారు.


Tags:    

Similar News