Road Accident :అతివేగమే ప్రాణం తీసింది.. నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

శబరిమలకు వెళుతున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు

Update: 2025-11-24 07:00 GMT

శబరిమలకు వెళుతున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మాలూరు తాలూకా అబ్బెనహళ్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో శబరిమలకు వెళ్తున్న నలుగురు యాత్రికులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ప్రమాదం అర్ధరాత్రి 2.15 గంటల నుంచి 2.30 గంటల మధ్య చోటుచేసుకుంది. కారు ఫ్లైవోవర్ పక్కబారియర్‌ను బలంగా ఢీకొట్టడంతో వాహనం సుమారు 100 మీటర్లు దిగువనున్న అండర్‌పాస్‌లో పడిపోయింది.

స్నేహితులందరూ...
అక్కడికక్కడే కారులో ఉన్న నలుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరు అందరూ స్నేహితులే. కేరళలోని శబరిమలకు బయలుదేరిన సమయంలోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడంతో నియంత్రణ కోల్పోయి బారియర్‌ను ఢీకొట్టినట్లు సీనియర్ అధికారి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News