బాంబు పేలుళ్ల కుట్ర కేసులో మరో కీలక నిందితుడి పేరు.. విచారణలో బయటపెట్టిన సిరాజ్

విజయనగరానికి చెందిన సమీర్ అరెస్ట్ తో దేశంలో బాంబు పేలుళ్ల ముప్ప తప్పినట్లయింది. అయితే ఈ కేసులో మరో వ్యక్తి పేరు కీలకంగా మారింది

Update: 2025-05-26 06:19 GMT

విజయనగరానికి చెందిన సమీర్ అరెస్ట్ తో దేశంలో బాంబు పేలుళ్ల ముప్ప తప్పినట్లయింది. అయితే ఈ కేసులో మరో వ్యక్తి పేరు కీలకంగా మారింది.సిరాజ్, సమీర్ విచారణ లో సుఫియా ఉర్ సయ్యుద్దీన్ పేరు బయటకు వచ్చింది. కర్ణాటకు లో గుల్బర్గాకు చెందిన సయ్యుద్దీన్ తో ఏర్పడిన పరిచయాలను సమీర్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గత మూడురోజుల నుంచి సిరాజ్, సమీర్ లను ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరం తీసుకెళ్లి విచారణ జరపుతున్నారు. ఈ విచారణలో అనేక కీలకమైన అంశాలను సిరాజ్,సమీర్ చెప్పినట్లు తెలిసింది. తొలి రోజు సమీర్ దీనిపై పెదవి విప్పకపోయినా రెండో రోజు నుంచి మాత్రం కొన్ని కీలక విషయాలు చెబుతున్నారు.

అహీం గ్రూపుతోనే...
ఇప్పటి వరకూ వరంగల్ కు చెందిన యువకుడితో పాటు మరికొందరి సహకారం ఉంటుందని భావించిన ఎన్ఐఏ అధికారుల ఇప్పుడు కర్ణాటకకు కూడా ఈ కేసు మూలాలు పాకడంతో ఆ దిశగా విచారణ చేయనున్నారు. సుఫియా ఉర్ సయ్యుద్దీన్ సమీర్ కు ఎలా పరిచయం అయ్యాడు? అతని నేపథ్యం ఏంటి? అతనికి ఏమైనా ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయా? లేక సయ్యుద్దీన్ ఏం ప్లాన్ చేశాడు? సమీర్ తో ఏం మాట్లాడాడు? వంటి విషయాలపై ఆరా తీసేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, వరంగల్, విజయనగరం, ఢిల్లీ వంటి నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ లు చేసి పెద్దయెత్తున ప్రాణనష్టం కలిగించడానికి వీరు వేసిన ప్లాన్ ఏంటి అన్న దానిపై కూడా వివరాలను సేకరిస్తున్నారు.
అతని నేపథ్యం ఏంటి?
సుఫియా ఉర్ సయ్యుద్దీన్ వృత్తి ఏంటి? అతనికి ఎక్కడి నుంచైనా డైరెక్షన్స్ వచ్చాయా? లేక సమీర్ కు ఏ రకమైన సలహాలు, సూచనలు ఇచ్చాడన్న దానిపై ఎన్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో సమీర్, సిరాజ్ తో పాటు సుఫియా ఉర్ సయ్యుద్దీన్ కూడా కీలకంగా మారారని విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. అహీం గ్రూపు సభ్యుల కోసం కూడా ఇప్పటికే గాలింపు మొదలయింది. మొత్తం పన్నెండు మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఇద్దరే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లి గాలిస్తున్నాయి. అయితే తాజాగా ఈ కేసులో కీలకంగా మారిన సయ్యుద్దీన్ ను అదుపులోకి తీసుకుంటే మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News