కట్టుకున్నోడినే కసిగా చంపేస్తున్నారుగా.. ఏం జరుగుతుంది రా?

ఆంధ్రప్రదేశ్ లో మరొక హత్య జరిగింది. అందుకు కూడా భార్యే కారణం. తన ప్రియుడితో ప్లాన్ చేసి మరీ చంపించేసింది

Update: 2025-06-25 12:08 GMT

తాళికట్టినోళ్లనే కాటికి పంపించేస్తున్నారు. శారీరక సుఖం కోసం జీవితాంతం అండగా నిలిచే భర్తను సయితం మట్టు బెట్టేందుకు కొందరు యువతులు ఏ మాత్రం వెనకడాటం లేదు. కేవలం వివాహేతర సంబంధాలే ఈ హత్యలకు మూలకారణాలు. కొన్ని హత్యల్లో కారణం ప్రేమ కారణమవుతుంది. గద్వాల్ లో తేజేశ్వర్ హత్య కేసును తెలుసుకుని రెండు తెలుగు రాష్ట్రాలు నివ్వెరపోయిన గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ లో మరొక హత్య జరిగింది. అందుకు కూడా భార్యే కారణం.తన ప్రియుడితో ప్లాన్ చేసి మరీ చంపించేసింది. అనంతపురం జిల్లాలోని అక్కంపల్లి - రాచానపల్లి రోడ్డులో ఈ హత్య జరిగింది. కల్యాణదుర్గంలో బతుకుదెరువు కోసం సురేష్ బాబు అనే 43 ఏళ్ల వ్యక్తి హోటల్ ను నడుపుపుకుంటూ తన భార్య అనితతో జీవినం కొనసాగిస్తున్నారు.

కల్యాణదుర్గంలో...
హోటల్ మీద వచ్చిన ఆదాయంతో బతుకు సుఖంగానే సాగిపోతున్న తరుణంలో అనితకు ఆ హోటల్ వద్దకు తరచూ వచ్చే ఫక్రూద్దీన్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. సురేష్ బాబుకు తెలియకుండా ఇద్దరు తరచూ కలుసుకునే వారు. కొన్నాళ్లు గుట్టుగానే సాగిన వీరి వ్యవహారం తర్వాత సురేష్ బాబుకు తెలియడంతో భార్య అనితను నిలదీశాడు. మద్యం సేవించి వచ్చి అనితపై దుర్భాషలాడాడు. ప్రతిరోజూ ఫక్రూద్దీన్ తో దూరంగా ఉండాలని సురేష్ బాబు భార్య అనితను కోరుతుండటంతో విసిగి వేసారింది. తాను ఫక్రూద్దీన్ తోనే ఉండాలని నిర్ణయించుకున్న అనిత తన భర్తను లేపేయాలని ప్లాన్ చేసింది. తన భర్త ఉండగా మనమిద్దరం కలుసుకోలేమని, వేసేయాలని ఫక్రుద్దీన్ ను అనిత ఉసిగొల్పింది.
రెండు నెలల పరిచయానికే...
ఏళ్ల క్రితం పెళ్లయిన భర్తను కాదని, రెండు నెలల క్రితం పరిచయమైన ఫక్రుద్దీన్ తోనే తన జీవితం బాగుంటుందని తలచింి. అందుకు రాత్రి హోటల్ మూసివేసిన తర్వాత ద్విచక్రవాహనంపై వెళ్లే తన భర్తను హతమార్చాలని ప్లాన్ చెప్పింది. అయితే నిన్న హోటల్ పనిమీద మార్తాడు గ్రామానికి వెళ్లిన సురేష్ బాబు తిరిగి హోటల్ కు చేరుకున్నాడు. హోటల్ నుంచి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న సురేష్ బాబుపై ఫక్రుద్దీన్ దాడి చేశాడు. అతనిని చంపేందుకు తాను ముందుగా తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో తర్వాత బండరాయితో మోదాడు. సురేష్ బాబు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఇద్దరినీ హత్య జరిగిన ఆరు గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఇలాంటి హత్యలు తరచూ జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.











Tags:    

Similar News