రోడ్డుప్రమాదంలో ఇద్దరు కనిగిరివాసుల మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

Update: 2022-12-04 05:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రొంపిచర్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో లారీ - కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అతి వేగమే...
మృతులు ఇద్దరూ కనిగిరికి చెందిన మల్లికార్జునరావు, ప్రసాద్ లుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కనిగిరిలో విషాదం అలుముకుంది.


Tags:    

Similar News