Road Accident : మహారాష్ట్ర ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. నలభై మందితో వెళుతున్న ఒక వాహనం అదుపుతప్పి గోతిలో పడిందని పోలీసులు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా పహల్ వాడీ గ్రామానికి చెందిన పలువురు ఖఏడ్ తహసిల్ పరిధిలోని మహదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వాహనం అదుపు తప్పడంతో...
అయితే వాహనం అదుపు తప్పడంతో గోతిలోపడిపోయింది.వెంటనే స్థానికులు, పోలీసులు కలసి సహాయక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమాదంలో ఇరవై ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు,చిన్న పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.