రన్నింగ్ ట్రైన్ లో కాల్పులు.. పాపం ఆ ప్రయాణీకులు
మహా రాష్ట్రలోని పాల్ఘర్ లో కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం
రన్నింగ్ ట్రైన్ లో కాల్పులు జరిగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పాలగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్ లో ఉండగానే ఒక ఆర్.పీ.ఎఫ్. కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణీకులు.. మరో పోలీసు మృతి చెందినట్టు సమాచారం.
మహా రాష్ట్రలోని పాల్ఘర్ లో కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి. జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బి 5 కోచ్ లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరపడంతో ఏఎస్ఐ సహా నలుగురు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన అనంతరం రైళ్లోంచి చేతన్ దూకేశాడు. నిందితుడు చేతన్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ నలుగురిని కాల్చిచంపిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాపి నుండి బోరివలి నుండి మీరా రోడ్ స్టేషన్ మధ్య జరిగింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. "రైలు నెం. 12956లో 31.7.23న 5.23 గంటలకు B5 కోచ్‌లో కాల్పులు జరిగాయి. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న CT చేతన్, ఎస్కార్ట్ ఇంచార్జి ASI టికా రామ్‌పై కాల్పులు జరిపినట్లు ధృవీకరించాము. ASIతో పాటుముగ్గురు పౌరులు చనిపోయారు. ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు." అని ఉంది.