బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రధాని దిగ్భ్రాంతి

రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఆ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 20 నుంచి 30 కి.మీ.గా

Update: 2022-11-21 05:57 GMT

bihar road accident

బీహార్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రార్థనా మందిరం నుండి వెళ్తున్న పాదచారులపైకి ట్రక్కు దూసుకు రావడంతో ఆరుగురు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైశాలి జిల్లా దేశారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్-మహనార్ ప్రధాన రహదారిపై జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఆ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 20 నుంచి 30 కి.మీ.గా నిర్ణయించినప్పటికీ ట్రక్కు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతులు వర్ష కుమారి(8), సురుచి కుమారి (12), అనుష్క కుమారి (8), శివాని (8), ఖుషీ కుమారి (10), చందన్ కుమార్ (20), కోమల్ కుమారి (10), సతీష్ కుమార్ (17) లుగా గుర్తించారు. గాయపడినవారిలో సురుచి కుమారి (8), అంజలి కుమారి (6), సౌరభ్ కుమార్ (17)లతో పాటు.. మరో 50 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వారంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


Tags:    

Similar News