Bathula Prabhakar : బత్తుల వ్యూహాలకు పోలీసుల చిత్తు
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. నెలన్నర గడుస్తున్నప్పటికీ ఇంకా బత్తుల ప్రభాకర్ ఆచూకీ లేదు.బత్తుల ప్రభాకర్ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. అయినా ఏ మాత్రం చిన్న ఆచూకీ కూడా దొరకడం లేదు. పోలీసులకు బత్తుల ప్రభాకర్ ను పట్టుకోవడం సవాల్ గా మారిందనే చెప్పాలి. ఫలితం కనిపించడం లేదు. బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల నుంచి సెప్టంబరు 22వ తేదీన తప్పించుకున్నాడు. ఇప్పటికి నెలన్న రోజులు గడుస్తున్నా బత్తుల ప్రభాకర్ ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే అతని క్రిమినల్ మైండ్ ఏ పాటిదో ఇప్పటికే అర్ధమయి ఉంటుంది. బత్తుల ప్రభాకర్ ను తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు పోలీసుల నుంచి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు.
పోలీసుల నిర్లక్ష్యమే...
ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి ఆగడంతో టాయ్ లెట్ కు వెళతానని చెప్పి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. బత్తుల ప్రభాకర్ సులువుగా తప్పించుకోవడమే కాకుండా దొకరడం కూడా కష్టంగా మారింది. గతంలోనూ బత్తుల ప్రభాకర్ తప్పించుకుని మూడేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎలాంటి వేషంలో తిరుగుతున్నాడో తెలియదు. ఫోన్ వాడడు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ బత్తుల ప్రభాకర్ ను వెంటనే పట్టుకోవడానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం పనిచేయడం లేదు. నల్ బత్తుల ప్రభాకర్ పై తమిళనాడు, కర్ణాటకలో దాదాపు నలభైకి పైగానే కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 కేసులు నమోదయి ఉన్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం...
బత్తుల ప్రభాకర్ కోసం పది ప్రత్యేక బృందాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ క్రైమ్ హిస్టరీ చూసయినా అతనిని పట్టుకున్నప్పుడు.. బత్తులను జైలుకు తీసుకెళుతున్న సమయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు పాటించాలి. కానీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎన్నో కేసులను సులువుగా ఛేదిస్తూ నిందితులను గంటల్లో పట్టుకుంటున్న పోలీసులు బత్తుల ప్రభాకర్ విషయంలో మాత్రం అట్టర్ ఫెయిల్ అవుతున్నారు. బత్తుల ప్రభాకర్ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లి ఉంటాడని అనుమానించి అక్కడకు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలిస్తూనే ఉన్నారు. అయినా బత్తుల జాడ ఇంత వరకూ లేదు. ఇంతకీ బత్తుల ప్రభాకర్ దొరుకుతాడా? అంటే ఎవరి వద్దా సరైన సమాధానం లేదు.