Google Map: గూగుల్‌ మ్యాప్‌లో అదిరిపోయే ఫీచర్‌

చాలా మందిని గూగుల్‌ను నమ్ముకుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. రూట్‌ తెలియపోయినా.. గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుంటూ సులభంగా..

Update: 2023-12-03 04:00 GMT

చాలా మందిని గూగుల్‌ను నమ్ముకుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. రూట్‌ తెలియపోయినా.. గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుంటూ సులభంగా అనుకున్న గమ్యానికి తీసుకెళ్తుంది. ఈ మధ్య కాలంలో గూగుల్‌ మ్యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసింది గూగుల్‌. కొత్త కొత్త ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ మధ్య కాలంలో వాహనాలు వేగంగా నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతుండగా, ఎంతో మంది గాయాలతో బయటపడుతున్నారు. వేగంగా వెళ్లవద్దని ఎన్ని మార్లు చెప్పినా.. పదేపదే వాహనదారుల్లో అవగాహన కల్పించినా తీరుమారడం లేదు. ఎంత స్పీడ్‌గా వెళ్తున్నామనే ధ్యాసకూడా ఉండటం లేదు చాలా మందిలో. వేగంగా వెళ్లడం వల్ల ట్రాఫిక్‌ చలాన్‌లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని ట్రాఫిక్‌ పోలీసులు సైతం పదేపదే చెబుతున్నారు.

ఇలాంటి సమయాల్లో గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఎలాగంటే మనం పరిమితికి మించి వేగంగా వెళ్తే వెంటనే అలర్ట్‌ చేస్తుంది. దీని కోసమే రియల్‌ టైమ్‌ స్పీడ్‌ లిమిట్‌ ఇన్ఫర్మేషన్‌ డ్రైవర్‌కు తెలిపేలా గూగుల్‌ తన మ్యాప్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పొందుపర్చింది. వాహనదారుడు అధిక వేగం వెళ్తే అలర్ట్‌ ఇస్తుంది. స్ట్రీట్‌ వ్యూ ఫొటోలు, థర్డ్‌ పార్టీ ఫొటోల సాయంతో స్పీడ్‌ లిమిట్‌ను గూగుల్‌ గుర్తు చేస్తుంటుంది. అయితే ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫీచర్‌ పొందడం ఎలా..?

గూగుల్‌ మ్యాప్‌లో ఈ ఫీచర్‌ను సులభంగానే పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం..

➦ ముందుగా గూగుల్‌ మ్యాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి.

➦ పైన కుడివైపున ఉన్న ప్రొఫైల్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేసిన తర్వాత 'Settings'ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

➦ ఆ తర్వాత స్క్రీన్‌ని కిందకు స్క్రోల్‌ చేసి Navigation settings అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి.

➦ అందులో Driving options ఎంపిక చేయాలి.

➦ అందులో డ్రైవింగ్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు ఉంటాయి. వాటిలో speedometer ఆప్షన్‌ను ఎనేబల్‌ చేసుకుంటే మీరెంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్‌ పొందవచ్చు. అలానే మిరు పరిమితికి మించి వాహనాన్ని స్పీడ్‌గా నడుపుతుంటే మిమ్మల్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది.

Tags:    

Similar News