RBI: ఆర్బీఐ... రెపోరేటు.. రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటి?

ఈ రోజుల్లో రకరకాల రుణాలు బ్యాంకుల నుంచి తీసుకుంటాము. అయితే రుణాలు తీసుకునే ముందు వడ్డీ ఎంత..? అనేది పరిశీలించేది

Update: 2023-11-23 00:30 GMT

ఈ రోజుల్లో రకరకాల రుణాలు బ్యాంకుల నుంచి తీసుకుంటాము. అయితే రుణాలు తీసుకునే ముందు వడ్డీ ఎంత..? అనేది పరిశీలించేది ముఖ్యమైన అంశం. బ్యాంకులకు రుణాలు ఇచ్చే అంశంలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియమ నిబంధనలు విధిస్తుంటుంది. రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు పని చేస్తాయి. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో న‌గ‌దు చలామణిని అదుపులో ఉంచడానికి ఉపయోగిస్తారు. అందుకే ద్రవ్య ప‌ర‌ప‌తి విధాన సమీక్ష జరిగినప్పుడల్లా ఏదో ఒక రేటు తగ్గించామనో, పెంచామనో లేదా పాతదే కొనసాగిస్తున్నామనో ప్ర‌క‌టిస్తుంటారు. ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో ప్రధానంగా నాలుగు రేట్ల ప్ర‌స్తావ‌న వ‌స్తుంటుంది. వాటి గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

రెపో రేటు గురించి తెలుసుకుందాం.

ఆర్బీఐ సమావేశం జరిగినప్పుడల్లా రేపోరేటు, రివర్స్‌ రెపోరేటు అనే పదాలను వింటుంటాము. ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రేపో రేటున‌ను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ కారణంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రేపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు.

రివర్స్ రెపో రేటు అంటే.. 

రివర్స్‌ రెపో రేటు అంటే బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉందని భావిస్తే రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వవచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా కాస్త తక్కువగా ఉంటుంది.

రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్ప‌ట్లో ఆర్బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News