Gold Price Today : మళ్లీ లక్షకు చేరుకున్న బంగారం ధరలు.. ఇక పెరగడమేనా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని కొందరు చెబుతున్నారు. అయితే భారీగా పతనం దిశగా ధరలు పయనిస్తాయని మరికొందరు బిజినెస్ అనలిస్టులు గత కొంతకాలంగా చెబుతున్నారు. లక్ష రూపాయలు పది గ్రాముల బంగారం ధర దాటుతుందని చెప్పిన మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. అదే సమయంలో పది గ్రాముల ధర యాభై వేలకు పడిపోతుందని మరికొందరు చెప్పిన మాటలు మాత్రం కనుచూపు మేరలో జరిగే అవకాశం కనిపించడం లేదు. అయితే ఇంకా ధరలు పెరుగుతాయన్నది మాత్రం వాస్తవమని అనేక మంది చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు చేరువలో ఉన్న బంగారం ధరలు మరింత పెరిగితే కొనుళ్లపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ సుంకాలతోనేనా?
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఐదు శాతం పన్నులు విధించడంతో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణిస్తుందని ఆ ప్రభావంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా గట్టిగా చెబుతున్నారు. రేపటి నుంచే పెరిగిన సుంకాలు అమలులోకి రానుండటంతో ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు అందుతున్నాయి. అందులో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువ మంది బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంత ధరలు పెరిగితే ఏ మాత్రం కొనుగోలు చేస్తారన్నది మాత్రం సందేహంగానే కనిపిస్తుంది.
భారీగా పెరిగి...
బంగారంపై పెట్టుబడి సురక్షితమే అయినప్పటికీ ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి పెట్టుబడి దారులు కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావం కూడా అమ్మకాలపై పడుతుందని అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 680 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 1,200 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,1100 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రముల బంగారం ధర 1,00480 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,17,100 రూపాయలుగా ఉంది.