Gold Rates Today : పసిడి ప్రియులకు మళ్లీ షాకిచ్చిన ధరలు.. ఈసారి ఎంత పెరిగాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2025-02-05 03:42 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయి. అది అందరూ అనుకుంటున్నదే. సీజన్ ప్రారంభం కావడంతో సహజంగా ధరలు పెరగడం ఖాయమని అందరూ అంచనా వేసుకున్నారు. మార్కెట్ నిపుణుల నుంచి బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ వరకూ అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. మొన్నటి వరకూ బంగారం ధరలు కొంత అందుబాటులో ఉండేవి. కానీ ఈ ఏడాది మొదటి రోజు నుంచే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే 85 వేల రూపాయలకు చేరింది. కిలో వెండి ధర లక్ష ఆరు వేల రూపాయలు పలుకుతుంది. ఇంత స్థాయిలో భారీ గా ధరలు పెరగడం మునుపెన్నడూ చూడలేదని వినయోగదారులు వాపోతున్నారు.

కొనుగోళ్లు లేక...
ఇదే సమయంలో వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తెప్పించిన నిల్వలు అమ్ముడు పోక ఇబ్బంది పడుతున్నారు. అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ వంటి కారణాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వారు చెబుతున్నారు.
సీజన్ ప్రారంభం కావడంతో...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ఇక బంగారం కొనుగోలు చేయడం కష్టమేనన్న ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. అందుకే బంగారం వైపు చూడటానికే భయపడి పోతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,200 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,05,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News