Gold Price Today : పసిడిప్రియులకు షాకిస్తున్న గోల్డ్.. ఇలా పెరుగుతుంటే ఎలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2025-02-12 03:03 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని అందరికీ తెలుసు. అలాగని ధరలు మరీ అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు కూడా తగ్గుతాయని పెద్దగా పెరగవులేనన్న ధీమాలో పసిడి ప్రియులున్నారు. కానీ అందుకు భిన్నంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి ధరలు కూడా దానితో పాటు పరుగును అందుకున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం, వెండి వంటి ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. డబ్బులు తమ వద్ద ఉన్న వాటితో ఆశించిన ఆభరణాలు కూడా రాకపోవడతో వారు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

ఎక్కడ స్టాక్ అక్కడే...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమై కొద్ది రోజులవుతుంది. మాఘమాసంలో బంగారం ధరలు పెరుగుతాయని అందరికీ తెలుసు. కొన్ని లక్షల పెళ్లిళ్లతో పాటు శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేల రూపాయలకు చేరువలో ఉంది. వెండి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. పెట్టుబడి పెట్టాలనుకునే వారు సయితం ఇంత ధర పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని సాహసంగా భావిస్తున్నారు. మళ్లీ బంగారం ధరలు పతనం ప్రారంభమయితే నష్టాలు చవి చూడాల్సి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. అయితే బంగారం ధరలు ఎప్పుడూ తగ్గవని, ఎప్పుడు పెట్టుబడి పెట్టినా అది సురక్షితంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు పెరిగి...
మరోవైపు పది గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయాలంటే తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎంత మంది ఎక్కువ కొనుగోలు చేస్తుంటే అంత గిరాకీ పెరుగుతుంది. జ్యుయలరీ దుకాణాల్లో ఉన్న స్టాక్ క్షణాల్లో మాయమవుతుంది. కానీ ధరల పెరుగుదలతో ఎక్కడ స్టాక్ అక్కడే ఉండిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,011 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 90,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News